చీకట్లో మగ్గుతున్న గిరిజనులు | - | Sakshi
Sakshi News home page

చీకట్లో మగ్గుతున్న గిరిజనులు

Apr 20 2026 7:24 AM | Updated on Apr 20 2026 7:24 AM

అధికారులు, పాలకుల

తీరుకు కొవ్వొత్తులతో నిరసన

మనుబోలు: వైఎస్సార్‌సీపీ మద్దతుదారులుగా ఉన్నారనే కక్షతో అధికార పక్షం వివక్షకు, అధికారులు వంత పాడుతున్నారు. ఫలితంగా రెండు వారాలుగా వీధిలైట్లు వేయకుండా ఆ గిరిజన కాలనీలను చీకట్లో మగ్గపెడుతున్నారు. అధికారులు, పాలకుల తీరును నిరసిస్తూ స్థానిక గిరిజనులు ఆదివారం రాత్రి కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. మండలంలోని జట్లకొండూరు పంచాయతీ కొండూరుసత్రం ఎస్టీ కాలనీ, జ్యోతినగర్‌కు చెందిన గిరిజనులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వారాలుగా తమ కాలనీల్లో వీధిలైట్లు వెలగకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. కాలనీ పక్కనే చెట్లు, పొలాలు ఉండడంతో రాత్రయితే తేళ్లు, పాములు వీధుల్లోకి వస్తున్నాయని తెలిపారు. చిన్న పిల్లలు, వృద్ధులు రాత్రయితే ఇంట్లోంచి బయట అడుగు పెట్టాలంటే బయపడే పరిస్థితి నెలకొందన్నారు. అధికారులకు చెప్పినా.. పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అందరూ ఉద్దేశ పూర్వకంగానే తమ కాలనీలపై వివక్ష చూపుతున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వెంటనే వీధిలైట్లు వేయాలని కోరారు.

ఎస్‌ఈఐఎల్‌

ఎనర్జీకి అవార్డు

ముత్తుకూరు(పొదలకూరు): దేశంలోని ప్రముఖ విద్యుదుత్పత్తి సంస్థల్లో ఒకటైన ఎస్‌ఈఐఎల్‌ ఎనర్జీ లిమిటెడ్‌కు ప్రతిష్టాత్మక పబ్లిక్‌ రిలేషన్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ క్యాంపెయిన్‌ అవార్డు లభించింది. హైదరాబాద్‌లో నిర్వహించిన టీజీపీఆర్‌ కాన్ఫరెన్స్‌, నేషనల్‌ పీఆర్‌ డే వేడుకల సందర్భంగా ఈ అవార్డును సంస్థ కార్పొరేట్‌ రిలేషన్స్‌ విభాగ మేనేజర్‌ రాజిరెడ్డి కేసిరెడ్డి స్వీకరించారు. ఈ సందర్భంగా సీఈఓ జన్మేజయ మహాపాత్ర మాట్లాడారు. కార్పొరేట్‌ రిలేషన్స్‌ బృంద సృజనాత్మకత, వ్యూహాత్మక ఆలోచనతోనే ఈ గుర్తింపు లభించిందని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement