విద్యాహక్కు చట్టం ఆర్టీఈ – 12 (1)సీ ద్వారా ఉచిత ప్రవే శం కింద సీటొచ్చి న పేద విద్యార్థుల కు అడ్మిషన్లను తప్పక ఇవ్వాల్సిందే. గత మూడేళ్లుగా ఉచిత ప్రవేశాలకు సంబంధించిన ఫీజులను సకాలంలో చెల్లించకపోవడంతో అడ్మిషన్లను కొన్ని యాజమాన్యాలు నిరా కరించిన మాట వాస్తవమే. వీటిని చెల్లించాం. ఈ విద్యా సంవత్సరంలో ఇబ్బందేమీ ఉండదు.
– బాలాజీరావు,
డీఈఓ
అడిగిన ఫీజు కడితేనే అడ్మిషన్
ఉచిత ప్రవేశాలకు సంబంధించి నారాయణ పాఠశాలలో అడ్మిషన్‌ను నిరాకరిస్తే ఎంఈఓ, డీఈఓకు ఫిర్యాదు చేయగా. అడిగిన ఫీజు కట్టి ప్రవేశం పొందాలని వారు సలహా ఇచ్చారు. దీనిపై సదరు అధికారిపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే తరహాలో అధిక శాతం కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. ఈ విషయమై కలెక్టర్ దృష్టి సారించాలి.
– నరహరి, పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు


