ఉత్సాహంగా జిల్లాస్థాయి ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా జిల్లాస్థాయి ఎంపికలు

Apr 20 2026 7:24 AM | Updated on Apr 20 2026 7:24 AM

సంగం: మండలంలోని దువ్వూరు గ్రామంలో 13వ అంతర్‌ జిల్లాల బీచ్‌ కబడ్డీ చాంపియన్‌ షిప్‌కు జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికలు ఆదివారం ఉత్సాహంగా నిర్వహించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ సెక్రటరీ సతీష్‌ పర్యవేక్షణలో జరిగిన ఎంపికల్లో మహిళలు, పురుషుల విభాగాల్లో జిల్లాలోని పలు మండలాల నుంచి క్రీడాకారులు భారీగా తరలివచ్చారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మే 7 నుంచి 10వ తేదీ వరకు దువ్వూరులో రాష్ట్ర స్థాయి బీచ్‌ కబడ్డీ పోటీలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లాస్థాయిలో ఎంపికై న క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో కూడా రాణించాలని ఆకాంక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement