నెల్లూరు (టౌన్): ప్రపంచ పశు వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జిల్లా ఏహెచ్‌ఓఎస్‌ఏ, వీఏఎస్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రీడా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్చరీ, షటిల్ బ్యాడ్మింటన్, కబడ్డీ, క్యారమ్స్, టేబుల్ టెన్నీస్ తదితర ఆటల పోటీలను జరిపారు. ముఖ్య అతిథిగా సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ వి.సన్యాసిరావు హాజరై, ఆర్చరీ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం పశువైద్య వృత్తితో ఉండే వారు ఇలాంటి క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం పెరుగుతుందన్నారు. జిల్లా పశుసంవర్థక అధికారుల సేవా సంఘం అధ్యక్షుడు కృష్ణమౌర్య మాట్లాడుతూ ఈనెల 25న ప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పశువైద్య శాఖ సంయుక్త సంచాలకుడు కె.రమేష్‌నాయక్, జిల్లా హార్టికల్చర్ అధికారి కె.సుబ్బారెడ్డి, ఏహెచ్‌ఓఎస్‌ఏ కార్యదర్శి మాధవీలత, వీఏఎస్ ఎస్‌ఏ అధ్యక్షుడు డాక్టర్ జయపాల్, కార్యదర్శి కృష్ణమోహన్, చైతన్య కిశోర్, స్సోర్ట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


