ముత్తుకూరు (పొదలకూరు) : మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్ వేదికగా ఈ నెల 30 నుంచి మే 3వ తేదీ వరకు జరిగే జాతీ య స్థాయి టీ–10 క్రికెట్ పోటీలకు ఏపీ జట్టు కెప్టెన్‌గా ముత్తుకూరుకు చెందిన క్రీడాకారుడు బి.ప్రకాష్ ఎంపికయ్యారు. జట్టు సభ్యులుగా కరిముల్లా, సునీల్, వెంకటేశ్ నాగేంద్ర, అఖిల్‌ను అసోసియేషన్ ప్రకటించినట్లు ప్రకాష్ వెల్లడించారు. ముత్తుకూరు యువకుడు టీ–10 టీమ్‌కు కెప్టెన్‌గా ఎంపిక కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సోమశిలలో
58.47 టీఎంసీలు
సోమశిల: సోమశిల జలాశయంలో శనివారం సాయంత్రానికి 58.47 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పెన్నా డెల్టాకు 70, ఉత్తర కాలువకు 50, దక్షిణ కాలువకు 350 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. 97.781 మీటర్ల నీటిమట్టం నమోదైంది.
జర్నలిస్టులకు 24, 25న
మెగా హెల్త్ క్యాంపు
నెల్లూరు(దర్గామిట్ట): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలోని జీజీహెచ్‌లో జిల్లాలోని జర్నలిస్టులకు ఈ నెల 24, 25న ఉచిత మెగా హెల్త్ క్యాంపును నిర్వహించనున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హాజరుకావాలనుకునే వారు 95816 48888 వాట్సాప్ నంబర్‌కు తమ వివరాలతో మంగళవారం ఉదయం పదిలోపు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. జీజీహెచ్‌లో నేరుగా నమోదు చేసుకునే అవకాశం సైతం ఉందన్నారు. షుగర్, రక్త, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షల కోసం ఖాళీ కడుపుతో రావాలని, గత వైద్య పరీక్షల రిపోర్టులను తీసుకురావాలని కోరారు. సంబంధిత వైద్యుల ద్వారా కన్సల్టేషన్‌ను సైతం నిర్వహించనున్నామని వివరించారు. పేరు, పనిచేస్తున్న మీడియా సంస్థ, జన్మదినం, వయస్సు, ఆధార్, రేషన్, హెల్త్ / ఆరోగ్యశ్రీ కార్డు, మొబైల్ నంబర్, అక్రిడిటేషన్ నంబర్, కుటుంబసభ్యుల వివరాలను నమోదు చేయాలని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
శ్రీవారి దర్శనానికి
ఆరు గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం మోస్తరుగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 11 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 69,049 మంది శుక్రవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 23,842 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.57 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి ఆరు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.


