కేసులను వేగవంతంగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

కేసులను వేగవంతంగా పరిష్కరించాలి

Apr 19 2026 8:17 AM | Updated on Apr 19 2026 8:17 AM

హైకోర్టు జడ్జి జస్టిస్‌ సురేష్‌రెడ్డి

జిల్లాలోని న్యాయమూర్తులకు ఒక రోజు శిక్షణ

నెల్లూరు (లీగల్‌): పారదర్శకత, సామర్థ్యాన్ని పెంపొందించి.. కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడమే లక్ష్యంగా న్యాయమూర్తులు చొరవ చూపాలని హైకోర్టు జడ్జి జస్టిస్‌, జిల్లా న్యాయపాలన వ్యవహారాల జడ్జి సురేష్‌రెడ్డి సూచించారు. నగరంలోని జిల్లా కోర్టు సముదాయంలో జిల్లా స్థాయి న్యాయమూర్తులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన న్యాయవ్యవస్థ పనితీరును సమీక్షించారు. కొత్త చట్టాలపై సూచనలు, సలహాలిచ్చారు. న్యాయమూర్తుల సందేహాలను జిల్లా జడ్జి శ్రీనివాస్‌ నివృత్తి చేశారు.

ఘన స్వాగతం

హైకోర్టు జడ్జి జస్టిస్‌ సురేష్‌రెడ్డికి జిల్లా జడ్జి శ్రీనివాస్‌, అదనపు జిల్లా జడ్జిలు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు. తొలుత ఎస్‌బీఐ సౌజన్యంతో ఏర్పాటు చేసిన చలివేంద్రం, కోర్టు ఆవరణలో కక్షిదారులు కూర్చునేందుకు వీలుగా కల్పించిన సిమెంట్‌ బెంచీలను జస్టిస్‌ సురేష్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు. ఎస్పీ అజిత, జేసీ వెంకటేశ్వర్లు, ఎస్‌బీఐ చీఫ్‌ మేనేజర్‌ ఉదయ్‌కిషన్‌, ఏపీ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు సత్తు అంకయ్య, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి అయ్యప్పరెడ్డి, నాగరాజయాదవ్‌, ఉపాధ్యకుడు జల్లి పద్మాకర్‌. న్యాయవాది వేనాటి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement