పారదర్శకంగా సిబ్బంది బదిలీలు | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా సిబ్బంది బదిలీలు

Apr 19 2026 8:17 AM | Updated on Apr 19 2026 8:17 AM

మాట్లాడుతున్న ఎస్పీ

నెల్లూరు(క్రైమ్‌): జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శనివారం సిబ్బంది బదిలీల ప్రక్రియ జరిగింది. ఎస్పీ అజిత వేజెండ్ల పర్యవేక్షణలో ఏఎస్పీ సీహెచ్‌ సౌజన్య జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్‌లలో పీసీ, హెచ్‌సీ, ఏఎస్సైలుగా విధులు నిర్వహిస్తున్న 221 మంది సిబ్బందిని ఖాళీల ఆధారంగా వారు కోరుకున్న ప్రదేశాలకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పారదర్శకంగా సిబ్బంది బదిలీల ప్రక్రియ నిర్వహించామన్నారు. కార్యక్రమంలో నగర ఏఎస్పీ దీక్ష, ఎస్బీ డీఎస్పీ వి.ధీరజ్‌ వినీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement