నెల్లూరు (లీగల్): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్‌రెడ్డి నెల్లూరుకు శనివారం రానున్నారు. జిల్లా కోర్టు ఆవరణలో ఉదయం తొమ్మిది గంటలకు నిర్వహించనున్న కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తితో పాటు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ తదితరులు హాజరుకానున్నారు.
ప్రొవిజనల్
మెరిట్ లిస్ట్ విడుదల
నెల్లూరు(అర్బన్): నగరంలోని పెద్దాస్పత్రిలో గల డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఏడాది పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసేందుకు గానూ వెలువడిన నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ కొండేటి మాధవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదులు, అభ్యంతరాలుంటే ఈ నెల 21వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు వ్యక్తిగతంగా పెద్దాస్పత్రి పరిపాలన భవనంలోని కార్యాలయానికొచ్చి లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరారు. జాబితాను spsnellore. ap. gov. in/ notice/ recruitmentను పరిశీలించాలని సూచించారు.
కలెక్టరేట్లో ఏసీబీ
అధికారుల పరిశీలన
నెల్లూరు(దర్గామిట్ట): నెల్లూరు కలెక్టరేట్లో పలు సామగ్రిని ఏసీబీ అధికారులు, ఇన్‌స్పెక్టర్ విజయ్‌కుమార్ నేతృత్వంలో శుక్రవారం పరిశీలించారు. 2019కి ముందు ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలపై అప్పటి జిల్లా పౌర సరఫరాల సంస్థ డీఎం రోజ్‌మాండ్‌పై కేసును ఏసీబీ నమోదు చేసింది. ఈ క్రమంలో పలు గృహోపకరణాలను జప్తు చేసి కలెక్టరేట్లో నిల్వ ఉంచారు. వీటివివరాలను సేకరించేందుకు గానూ వారు పరిశీలించారు.
శ్రీవారి దర్శనానికి
18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 63,454 మంది గురువారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 24,882 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.12 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.


