● అనధికార కోతలతో
జనం సతమతం
● కూటమి ప్రభుత్వంలో
ఇదీ పరిస్థితి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): కూటమి ప్రభుత్వంలో విద్యుత్ కోతలు అధికమయ్యాయి. అసలే వేసవి కాలం కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో అనధికారికంగా కోతలు విధిస్తున్నారు. గ్రామాల్లో మాత్రం అధికారికంగా కోతలు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండటంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. పట్టణ, నగర ప్రాంతాల్లో మాత్రం రోజూ విద్యుత్ సబ్‌స్టేషన్ల మరమ్మతుల పేరుతో గంటలపాటు పగటిపూట సరఫరా ఆపేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి 10 నుంచి 12 గంటల సమయంలో కోతలు విధిస్తున్నారు. అక్కడ ఆదా చేసిన విద్యుత్‌ను పట్టణ, నగర ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో సరఫరా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో కోతలు మరింత ఎక్కువగా ఉంటాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
నెల్లూరులోని విద్యుత్ భవన్


