అనుమతితో మాకు పనిలేదు | - | Sakshi
Sakshi News home page

అనుమతితో మాకు పనిలేదు

Apr 18 2026 7:23 AM | Updated on Apr 18 2026 7:23 AM

లేఅవుట్‌కు గ్రావెల్‌ తరలింపు ఇష్టారాజ్యంగా బాటల నిర్మాణం

పొదలకూరు: ఎలాంటి అనుమతి లేకుండా విచ్చలవిడిగా గ్రావెల్‌ను తరలిస్తున్నారు. మండలంలోని మరుపూరుకు సమీపంలో ఉన్న ఇస్కాన్‌ సిటీ – 2 అతిపెద్ద లేఅవుట్‌కు భారీగా గ్రావెల్‌ తరలిస్తున్నట్టు గ్రామస్తులు వెల్లడించారు. లేఅవుట్‌కు సమీపంలో ఉన్న కల్సర్‌ గని నుంచి అమ్మిగుంట చేలు మీదుగా ఇందుకోసం తాత్కాలికంగా బాటల నిర్మాణం చేపట్టారు. అడ్డుకోవాల్సిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గ్రావెల్‌ తరలిపోతోంది. పొలాలకు సమీపంలో పెద్ద గుంతలు ఏర్పడుతున్నట్టు తెలుస్తోంది. లేఅవుట్‌ నిర్మాణం నుంచి వివాదాలు చోటుచేసుకుంటుండగా గతనెలలో తహసీల్దార్‌ సైతం వెళ్లారు. ప్రభుత్వ భూములు లేఅవుట్లో కలిశాయనే ఫిర్యాదుపై విచారణ నిర్వహించారు. ఇక్కడి లేఅవుట్లో సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కలిపేసుకుని నిర్మాణం చేపడుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ నాయకులు సైతం లేఅవుట్‌ వద్ద గతనెలలో ఆందోళన కూడా చేశారు. ఈ క్రమంలో లేఅవుట్‌కు విచ్చలవిడిగా గ్రావెల్‌ తోలకంపై గ్రామస్తులు మండిపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement