నెల్లూరు(పొగతోట): జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. తిరుపతిలో పీడీగా పనిచేస్తున్న సీవీ శ్రీనివాసప్రసాద్‌ను నెల్లూరుకు బదిలీ చేస్తూ రాష్ట్ర అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అదే సమయంలో డీడీఓగా ఉన్న ఎం.చిన్న మద్దులేటిని కూడా నెల్లూరు అధికారిగా బదిలీ చేశారు. కాసేపటికి ఉత్తర్వులు మార్చి తిరుపతి పీడీగా మద్దులేటిని నియమించారు. కాగా శ్రీనివాసప్రసాద్ జిల్లాకు వచ్చేందుకు సుముఖంగా లేరనే చర్చ జరుగుతోంది. ఆయన తిరుపతిలోనే కొనసాగుతారని, మద్దులేటికి నెల్లూరు డ్వామా పీడీగా మరలా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బదిలీలకు సంబంధించి జీఓలు మాత్రమే జారీ చేశారు. పీఆర్ కమిషనర్ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ పనిచేస్తున్న బి.గంగాభవానీని తిరుపతి డివిజినల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా (డీడీఓ)గా బదిలీ చేశారు.
పీడీలుగా ఇద్దరు
అధికారులకు ఉత్తర్వులు
మళ్లీ మార్చిన వైనం
కానీ ఎవరొస్తారో తెలియని పరిస్థితి
ప్రస్తుతం ఉన్న అధికారిణి తిరుపతికి బదిలీ


