కలెక్టరేట్‌లో ఉద్యోగుల గ్రీవెన్స్‌ | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో ఉద్యోగుల గ్రీవెన్స్‌

Apr 18 2026 7:23 AM | Updated on Apr 18 2026 7:23 AM

నెల్లూరు(దర్గామిట్ట): నెల్లూరు కలెక్టర్‌ కార్యాలయములోని తిక్కన ప్రాంగణంలో శుక్రవారం ఉద్యోగుల గ్రీవెన్స్‌ జరిగింది. వినతులను కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్‌ స్వీకరించారు. సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టర్‌కు రిటైర్డ్‌ రెవెన్యూ ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. కేటాయించిన స్థలానికి సంబంధించి ఉమ్మ డిగా నిధిని సేకరించామని, అసోసియేషన్‌లో జమ చే శామన్నారు. తమ అధ్యక్షుడు అడుగుతున్నా ఆ నిధి వివరాలు తెలియజేయడం లేదన్నారు. అమానుల్లా, శ్రీనివాసులు, భాస్కర్‌రెడ్డి, శివప్రసాద్‌, రియాజుద్దీన్‌ పాల్గొన్నారు.

● గత సంవత్సరం జూలై 25 నుంచి ప్రతినెలా 3వ శుక్రవారం ఉద్యోగస్తుల గ్రీవెన్స్‌ను నిర్వహించారు. 235 ఫిర్యాదులు అందులో 172ని పరిష్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement