నెల్లూరు రూరల్: మహిళా సాధికారతకు పెద్ద పీటేసిన ఏకై క నేత జగన్‌మోహన్‌రెడ్డి అని.. సీఎంగా ఉన్న ఐదేళ్లు వారి సంక్షేమం కోసం అహర్నిశలూ కృషి చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత పేర్కొన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో గురువారం ఆమె మాట్లాడారు. మహిళా బిల్లుకు మద్దతు చెప్పే అర్హత జగనన్న తర్వాతే ఎవరికై నా ఉంటుందని తెలిపారు. మహిళా సాధికారత కోసం ఆయన చేసిన కృషి అపారమైందని, రాష్ట్రంలో వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పించి దేశ చరిత్రలోనే కొత్త దిశను చూపారని కొనియాడారు. కేబినెట్‌లో డిప్యూటీ సీఎం, హోం, ఆరోగ్య, విద్య, సీ్త్ర శిశు సంక్షేమం వంటి కీలక శాఖలను మహిళలకు అప్పగించారని గుర్తుచేశారు. ఉద్యోగాల్లోనూ ప్రాధాన్యం కల్పించారని.. మహిళల హక్కులు, గౌరవం కోసం నిజంగా పనిచేసిన నేత జగనన్నేనని కొనియాడారు.
సీబీఎస్‌ఈ పది
ఫలితాల విడుదల
నెల్లూరు (టౌన్): సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం రాత్రి విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా 1500 మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 90 శాతానికిపైగా ఉత్తీర్ణత నమోదైంది.
డీసెట్‌కు దరఖాస్తు గడువు పొడిగింపు
నెల్లూరు (టౌన్): ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్)లో ఇంటర్ అర్హతతో రెండేళ్ల డీఎల్‌ఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే డీసెట్‌కు దరఖాస్తు గడువును ఈ నెల 25 వరకు పొడిగించారని డీఈఓ బాలాజీరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష తేదీలు త్వరలో వెలువడనున్నాయని వివరించారు. వివరాలకు cse.a p.gov.in, apdeecet.apcfss.inను సంప్రదించాలని సూచించారు.
మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి..
జిల్లాలోని మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి గానూ ఈ నెల 30వ దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ బాలాజీరావు తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో సాధించిన మెరి ట్, రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలను కల్పించనున్నామని వెల్లడించారు. స్కూల్ స్థాయిలో మె రిట్ జాబితా ప్రదర్శనను మే మూడున.. ఎంపికై న వారి జాబితాను ఐదున విడుదల చేసి.. సర్టిఫికెట్లను ఆరున పరిశీలించనున్నామని వివరించారు. ఆసక్తి గల వారు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు deonellore.50webs.c omను సంప్రదించాలని సూచించారు.


