మైనింగ్‌ అనుమతి రద్దు చేయాలంటూ.. | - | Sakshi
Sakshi News home page

మైనింగ్‌ అనుమతి రద్దు చేయాలంటూ..

Apr 17 2026 10:50 AM | Updated on Apr 17 2026 10:50 AM

గ్రామస్తుల ఆందోళన

సీతారామపురం: మండలంలోని సింగారెడ్డిపల్లిలో రెవెన్యూ అధికార యంత్రాంగం క్వార్ట్‌జ్‌ మైనింగ్‌కు అక్రమంగా ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళనను స్థానికులు గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గ్రామ సర్వే నంబర్‌ 129లో సుమారు 169 ఎకరాల మేత పొరంబోకు భూమిలో 80 ఏళ్లుగా పశువులు, మేకలు, గొర్రెలను మేపుతూ జీవనోపాధి పొందుతున్నామన్నారు. ఇటీవల ఆ భూమిని ఎస్జీఎస్‌ మినరల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి 30 ఏళ్ల పాటు క్వార్ట్‌జ్‌ మైనింగ్‌కు అనుమతులిచ్చారని తెలిసిందన్నారు. నెల్లూరులోని మైనింగ్‌ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయగా, మంజూరు పత్రాలను ఇచ్చారని, కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కో రామన్నారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఎంఓ యూ, రెవెన్యూ ఎన్‌ఓసీని వెంటనే రద్దు చేయా లని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్దార్‌ ఫాజిహాకు వినతిపత్రాన్ని అందజేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement