నెల్లూరు(టౌన్): ీసబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాల్లో నారాయణ సీబీఎస్‌ఈ పాఠశాలల విద్యార్థులు జిల్లాలో ప్రథమ, రాష్ట్రంలో ద్వితీయ స్థానాన్ని సాధించారని ఏజీఎం రవివర్మ తెలిపారు. గోమతినగర్‌లోని స్కూల్లో విద్యార్థులను గురువారం అభినందించిన అనంతరం ఆయన మాట్లాడా రు. ధనలక్ష్మీపురంలోని బాయ్స్ క్యాంపస్ విద్యార్థి సుధీర్ 500కు గానూ 493 మార్కులను సాధించారని వివరించారు. శశాంక్ కుమార్ 485, వర్షిణి 483, ప్రీతమ్ 482, వర్షిత, పర్ణిక 481, ఈక్షిత, కీర్తిప్రియ, సౌరభికి 480 మార్కులొచ్చాయన్నారు. ధనలక్ష్మీపురంలోని బాయ్స్ రెసిడెన్షియల్, రత్నం నారాయణ సీబీఎస్‌ఈ, ధనలక్ష్మీపురంలోని నారాయణ డే, గోమతినగర్‌లోని నారాయణ సీబీఎస్‌ఈ పాఠశాలల్లో చదువుతున్న 436 మంది ఉత్తీర్ణుౖలయ్యారని తెలిపారు. విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. క్లస్టర్ ప్రిన్సిపల్ శాంతి, రీజినల్ ఇన్‌చార్జి ఆదిశేషయ్య, సీబీఎస్‌ఈ కో ఆర్డినేటర్ నూర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.


