– మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
‘ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల ఆస్తి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లనివ్వం. జగనన్నే మన గుండె ధైర్యం. ఆ ధైర్యంతోనే పోరాడుదాం. మన మత్స్యకారుల ఆస్తి, భవిష్యత్‌ను కాపాడుకుందాం’ అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఈ ప్రాంత మత్స్యకారుల దశాబ్దాల కలను నిజం చేస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జువ్వలదిన్నె ఫిషింగ్‌హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడమే కాకుండా 90 శాతం మేర పనులు కూడా పూర్తి చేయడం జరిగిందన్నారు. హార్బర్‌ను అందుబాటులోకి తీసుకురావాల్సిన కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రైవేట్ సంస్థకు ధారాదత్తం చేయడం అంటే మత్స్యకారుల కడుపు కొట్టడమేనన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా జగనన్న నేతృత్వంలో ఫిషింగ్ హార్బర్‌ను కాపాడుకుని మత్స్యకారులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.


