ఫిషింగ్‌హార్బర్‌ ప్రైవేట్‌పరం దారుణం | - | Sakshi
Sakshi News home page

ఫిషింగ్‌హార్బర్‌ ప్రైవేట్‌పరం దారుణం

Apr 16 2026 10:24 AM | Updated on Apr 16 2026 10:24 AM

– రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి,

కావలి మాజీ ఎమ్మెల్యే

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగనన్న మత్స్యకారుల ఆస్తిగా ప్రకటించి నిర్మించిన ఫిషింగ్‌హార్బర్‌ను కూటమి ప్రభుత్వం ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించాలనుకోవడం దారుణమని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. సుమారు 70 ఎకరాల్లో రూ.300 కోట్ల వ్యయంతో 95 శాతం మేర పనులు పూర్తిచేసిన ఫిషింగ్‌హార్బర్‌ను స్వప్రయోజనాల కోసం పక్కన పెట్టేసి సాగర్‌ డిఫెన్స్‌ అనే సంస్థకు 30 ఎకరాలు కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. మత్స్యకారులకు జరుగుతున్న అన్యా యం తెలుసుకుని నేరుగా జగనన్నే జువ్వలదిన్నె వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. జగనన్న నేతృత్వంలో మత్స్యకారులకు అండగా నిలబడుతామని హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement