ద్వితీయ సంవత్సరంలో.. | - | Sakshi
Sakshi News home page

ద్వితీయ సంవత్సరంలో..

Apr 16 2026 10:24 AM | Updated on Apr 16 2026 10:24 AM

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో వారిదే హవా

ప్రథమ సంవత్సరంలో 78 శాతం ఉత్తీర్ణత

ద్వితీయ సంవత్సరంలో

82 శాతం నమోదు

రాష్ట్ర స్థాయిలో ఫస్ట్‌ ఇయర్‌లో

జిల్లాకు ఏడో స్థానం

ద్వితీయ సంవత్సరంలో 9వ స్థానం

బాలికల

ఉత్తీర్ణత

శాతం :

83

నెల్లూరు(టౌన్‌): ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. బాలికలు ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో హవా ప్రదర్శించారు. ప్రథమ సంవత్సరంలో బాలికలు 80 శాతం, బాలురు 73 శాతం, ద్వితీయ సంవత్సరంలో బాలికలు 83 శాతం, బాలురు 76 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్‌ ఇయర్‌లో 78 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో జిల్లా ఏడో స్థానంలో, సెకండ్‌ ఇయర్‌లో 82 శాతం ఉత్తీర్ణతతో 9వ స్థానంలో నిలిచింది. గత విద్యా సంవత్సరంలో ప్రథమ సంవత్సరంలో ఏడో స్థానం, ద్వితీయ సంవత్సరంలో 5వ స్థానం జిల్లాకు దక్కింది. సెకండ్‌ ఇయర్‌లో గతేడాదితో పోలిస్తే 4 స్థానాలు పడిపోయి 9వ స్థానానికి చేరింది.

53,404 మంది విద్యార్థులు

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు జరిగాయి. వీటికి జిల్లా వ్యాప్తంగా 53,404 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి 26,935 మంది, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 26,469 మంది ఉన్నారు.

దరఖాస్తు చేసుకోవచ్చు

ఫలితాలపై మార్కుల కోసం రీకౌంటింగ్‌, రీవాల్యుయేషన్‌కు ఈనెల 20 నుంచి 27వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రీ కౌంటింగ్‌కు ఒక్కో పేపర్‌కు రూ.260, రీవాల్యుయేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.1,300లు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు వచ్చేనెల 21 నుంచి జూన్‌ 4వ తేదీ వరకు జరుగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు వరకు నిర్వహిస్తారు. ప్రాక్టికల్స్‌ జూన్‌ 7 నుంచి 11వ తేదీ వరకు జరగనున్నాయి.

నెల్లూరులో పరీక్ష కేంద్రంలోకి వెళ్తున్న ఇంటర్మీడియట్‌ విద్యార్థినులు (ఫైల్‌)

సంవత్సరం విద్యార్థులు ఉత్తీర్ణులు శాతం స్థానం

2021 – 22 25,374 14,791 58 4

2022 – 23 25,535 17,042 67 4

2023 – 24 24,620 17,100 69 8

2024 – 25 26,272 19,282 73 7

2025 – 26 25,147 19,682 78 7

2021 – 22 25,576 17,190 67 3

2022 – 23 22,789 17,438 77 4

2023 – 24 21,293 17,292 81 6

2024 – 25 22,720 19,848 87 5

2025 – 26 24,141 19,771 82 9

విద్యార్థుల సత్తా

ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 470 మార్కులకు అత్యధికంగా వెంకట్‌ చేతన్‌ శ్రీధర్‌రెడ్డి 468, మన్నే సహస్ర దీక్షితరెడ్డి, పెంచల జస్విత, మనోజ్ఞ, మునిశశాంక్‌, పూర్వికాక్షయ, మోక్షితలక్ష్మి, వైష్ణవి, సాత్విక్‌రెడ్డి, సంకీర్తన 467 మార్కులు, ఛాయశ్రుతి, ఎన్‌.చరణి 466, నవదీప్‌, రోషిణి అనుజ్ఞ, వెంకట ధర్మేంద్ర, ప్రవీణ్‌కుమార్‌, ఓంకారేశ్వర్‌, హిమవర్షిణి, సాత్విక్‌ 465 మార్కులు, బైపీసీలో 455 మార్కులకు తుమ్మల లలిత 452, నిశాంత్‌, లక్ష్మీప్రణీత, జవేరి లాస్య, వసుధ హర్షిణి 451 మార్కులు, మహిశ్రీ, సిద్ధిఖ్‌లు 450 మార్కులు సాధించారు. సాధించారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో 1,000 మార్కులకు దివ్య ముత్యాల 992 మార్కులు, కావ్య హరి, నాగహేమంత్‌, నాగలక్ష్మి సువిధ 991, సీహెచ్‌ శరణ్య 988, బైపీసీలో షేక్‌ తస్లీమ్‌ 990, దేవ హర్షిణి 989 మార్కులు సాధించారు.

ఐదేళ్లుగా ప్రథమ సంవత్సర ఫలితాలిలా..

Advertisement
 
Advertisement
Advertisement