మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు.. ఆత్మకూరు మండలం బనవరాజుపాళేనికి చెందిన ఉపాధి కూలీలు మనోజ్ (32), అరుణ్ (24)తోపాటు మరో వ్యక్తి మోటార్‌బైక్‌పై డీసీపల్లి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో డీసీపల్లి పెట్రోల్ బంక్ సమీపంలో అకస్మాత్తుగా గేదెలు అడ్డుగా రావడంతో వాటిని ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మనోజ్, అరుణ్ తీవ్రంగా గాయపడగా వెంటనే వారిని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు. అరుణ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మనోజ్‌కు వివాహామైంది. ఈ ఘటనతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటనపై మర్రిపాడు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.
గంజాయి అక్రమ రవాణా కేసులో ఐదేళ్ల జైలు
నెల్లూరు(లీగల్): గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నాడని నమోదైన కేసులో నేరం రుజు వు కావడంతో తమిళనాడు రాష్ట్రానికి చెందిన షణ్ముగవేలు మారిముత్తుకు శిక్ష పడింది. ఐదు సంవత్సరాల జైలుశిక్షతోపాటు రూ.10 వేలు జరిమానా విధిస్తూ నెల్లూరు మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జి.గీత బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో 2021 డిసెంబర్ 17వ తేదీ మధ్యాహ్నం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నెల్లూరు – 1 అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. తమిళనాడుకు చెందిన షణ్ముగవేలు 8 కేజీల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైమేరకు తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ షేక్ రఫీ మాలిక్ వాదించారు.
స్నేహితుడితో ఈతకెళ్లి..
● యువకుడి మృతి
నెల్లూరు సిటీ: పెన్నానదిలో ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు నగరంలోని మనుమసిద్ధినగర్‌కు చెందిన నాగరాజు (28) తన స్నేహితుడైన మణికాంత్‌తో కలిసి మంగళవారం రూరల్ మండలంలోని కొండ్లపూడి గ్రామ సమీపంలోని పెన్నానదిలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో నాగరాజు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. మణికాంత్ కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని గాలించారు. నాగరాజు ఆచూకీ తెలియకపోవడంతో రూరల్ పోలీసులకు ఫిర్యాదు అందింది. బుధవారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహం ఒడ్డుకు చేరడంతో పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.


