మత్స్యకారులు మాట తప్పరు.. మడమ తిప్పరు | - | Sakshi
Sakshi News home page

మత్స్యకారులు మాట తప్పరు.. మడమ తిప్పరు

Apr 15 2026 7:26 AM | Updated on Apr 15 2026 7:26 AM

వైఎస్‌ జగన్‌ మాదిరిగానే మా మత్స్యకారులు మాట తప్పరు. మడమ తిప్పరు. గతంలో వేటకు చిన్నచిన్న తెప్పల్లో వెళ్లే వాళ్లం. వైఎస్‌ జగన్‌ మాకు మొదటగా ప్రాధాన్యమిచ్చి జువ్వలదిన్నెలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం దీన్ని ప్రైవేట్‌ కంపెనీలకు అప్పగించాలని చూస్తోంది. జగన్‌మోహన్‌రెడ్డి చొరవ తీసుకోకుంటే.. మాకు ఫిషింగ్‌ హార్బర్‌ అనేది జీవిత కాలం కలగానే మిగిలిపోయేది. మేమంతా బతుకుదెరుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులు తప్పవు. మాకు మేలు జరిగితే మా 164 గ్రామాలు జగన్‌ వెంట నడవడానికి తీర్మానం చేసుకుంటాం. –పొన్నాడి శూలం, ఎంపీటీసీ, అన్నగారిపాళెం

Advertisement
 
Advertisement
Advertisement