రైతాంగాన్ని నిరాశ పరిచిన బడ్జెట్
బడ్జెట్‌లో రైతులకు తీవ్ర నిరాళను మిగిల్చింది. గిట్టుబాటు ధరలు లేవు, కనీస మద్దతు ధర కరువైంది. కౌలు రైతుల ఊసేలేదు. ధరల స్థిరీకరణ నిధిని కేవలం రూ.500 కోట్లకు పరిమితం చేయడం దారుణం. అన్నదాత సుఖీభవ, జలవనరుల ప్రాజెక్ట్‌ల విస్తరణకు నిధులు తక్కువగా కేటాయించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయిస్తే నెల్లూరు జిల్లాకు కూడా మేలు జరిగేది. ఈ ప్రాజెక్ట్‌కు ప్రాధాన్యత ఇవ్వకపోవడం శోచనీయం. విత్తన సబ్సిడీ, యంత్ర పరికరాలకు ఇచ్చే సబ్సిడీ కేటాయింపులు కూడా లేవు. వ్యవసాయ రుణాలపై సున్నా వడ్డీ పథకానికి నిధులు ఇవ్వలేదు.
– చిరసాని కోటిరెడ్డి,
రైతు సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు


