నిరాశ, దగా బడ్జెట్
●
రాష్ట్ర బడ్డెట్ అన్నీ వర్గాలను తీవ్ర నిరాశ పర్చింది. పీఆర్సీ, ఐఆర్ ప్రఽకటన వస్తోందని ఆశించిన ఉద్యోగులతోపాటు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 ఏళ్లకే పింఛన్ మాటే లేదు. పొదుపు మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు సున్నా వడ్డీ ప్రస్తావనే కరువైంది. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఇచ్చే ధరల స్థిరీకరణకు మొక్కుబడిగా నిధులు కేటాయించారు. వెనుకబడిన ఉదయగిరి అభివృద్ధికి బడ్జెట్‌లో నిధులు కేటాయింపులు లేవు. రూ.లక్షల కోట్లు అప్పులు తప్ప... అభివృద్ధి, సంక్షేమం కనిపించడం లేదు. మొత్తంగా దగా బడ్జెట్‌గా చెప్పక తప్పదు.
– మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, ఉదయగిరి


