రూ.5.30 లక్షల విలువైన గుట్కాల స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): బిల్లుల్లేకుండా పొగాకు ఉత్పత్తుల విక్రయాలు, నిల్వలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కొద్దిరోజులుగా దాడులు చేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి నెల్లూరులోని పలు ట్రాన్స్‌పోర్టు కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. పప్పులవీధి, స్టోన్‌హౌస్‌పేటలోని రెండు ట్రాన్స్‌పోర్టు కార్యాలయాల్లో రూ.5.30 లక్షలు విలువైన గుట్కాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ కె.నరసింహారావు, డీసీటీఓ కె.విష్ణురావు, ఆఫీస్ సూపరింటెండెంట్ శాంతిభూషణ్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
జింకను ఢీకొట్టిన
గుర్తుతెలియని వాహనం
కావలి రూరల్: కావలి బుడంగుంట సమీపంలో ప్రధాన రహదారిపై రోడ్డు దాటుతున్న జింకను గుర్తుతెలియని వాహనం మంగళవారం ఢీకొట్టింది. స్థానిక యువకులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. బీట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని జింకకు వైద్యం కోసం పశు వైద్యాధికారిని పిలిపించారు. ప్రథమ చికిత్స అనంతరం ఫారెస్ట్ ఆఫీసుకు తరలించారు. పశు వైద్యుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జింక పక్కటెముకలు విరిగినట్లు తెలిపారు. చికిత్స చేశామన్నారు.
కండలేరులో
57.360 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 57.360 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగకాలువకు 1,200, లోలెవల్ కాలువకు 200, హైలెవల్ కాలువకు 200, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 75 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
రూ.5.30 లక్షల విలువైన గుట్కాల స్వాధీనం
రూ.5.30 లక్షల విలువైన గుట్కాల స్వాధీనం


