ప్రజాభిప్రాయ సేకరణకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) నిబంధనలకు అనుగుణంగా 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనేందుకు వినియోగదారులు రిజిస్ట్రే షన్ చేసుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఏస్‌ఈ రాఘవేద్రం తెలిపారు. నెల్లూరులోని విద్యుత్ భవన్‌లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యుత్ సంస్థలు ప్రతిపాదించిన వార్షికాదాయ అవసరాల నివేదికపై మంగళవారం తిరుపతిలోని కార్పొరేట్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందన్నారు. 22, 23 తేదీల్లో విజయవాడలో, 27వ తేదీన కర్నూలులో ఏపీఈఆర్సీ చైర్మన్ వీవీఆర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని కావలి, కోవూరు, ఆత్మకూరు డివిజన్ల కార్యాలయాల్లో, నెల్లూరు టౌన్, నెల్లూరు రూరల్ ప్రాంత వినియోగదారులు విద్యుత్ భవన్‌లో పాల్గొనాలని కోరారు. ఉదయం నేరుగా పాల్గొనవచ్చని, రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మధ్యాహ్నం పాల్గొనాలన్నారు.


