81 బస్సులపై కేసుల నమోదు | - | Sakshi
Sakshi News home page

81 బస్సులపై కేసుల నమోదు

Jan 20 2026 8:29 AM | Updated on Jan 20 2026 8:29 AM

81 బస

81 బస్సులపై కేసుల నమోదు

నెల్లూరు(టౌన్‌): ఉప రవాణా కమిషనర్‌ బి.చందర్‌ ఆదేశాలతో అధికారులు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల్లో ఆది, సోమవారాల్లో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరు, వెంకటాచలం, కావలి ప్రాంతాల్లో జాతీయ రహదారిపై బస్సులను ఆపి పరిశీలించారు. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని 70 బస్సులు, నిబంధనలకు విరుద్ధంగా గూడ్స్‌ రవాణా, పర్మిట్‌, లైసెన్స్‌ లేని 11 వాహనాలపై కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. కార్యక్రమంలో ఆర్టీఓ మదాని, ఎంవీఐలు బాలమురళీకృష్ణ, కార్తీక్‌, ఏఎంవీఐలు స్వప్నీల్‌ రెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, కరుణాకర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

31 వరకూ

పశు ఆరోగ్య శిబిరాలు

నెల్లూరు(పొగతోట): పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదీ వరకు పశు ఆరోగ్య శిబిరాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు ఆ శాఖ ఉపసంచాలకుడు డాక్టర్‌ టి.సోమయ్య తెలిపారు. సోమవారం ఆ శాఖ కార్యాలయ ఆవరణలో శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. పశువులు, మేకలు, గొర్రెలున్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పశువైద్యాధికారులు పాల్గొన్నారు.

నగల చోరీపై

కేసు నమోదు

చిట్టమూరు: మండల పరిధిలోని కోగిలి పంచాయతీ పేరంటాలమిట్ట గ్రామంలో బంగారు నగల చోరీపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు సోమవారం పేర్కొన్నారు. ఆయన కథనం మేరకు.. సుమారు 46 గ్రాములు బంగారు నగల్ని బీరువాలో నుంచి గుర్తుతెలియని దుండగులు దోచుకెళ్లినట్లు గ్రామానికి చెందిన వెలుగు సునీతకు చెందిన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొత్తగుంట గ్రామంలో విచారణ జరిపారు. ఇటీవల నగలు అమ్మారా?, కుదవ పెట్టారా? అని ఆరాతీశారు.

స్వగ్రామానికి వెళ్తుండగా..

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

మనుబోలు: రోడ్డు ప్రమా దంలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన మండల పరిధిలోని జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని గురివిందపూడి పంచాయతీ అనుపల్లిపాడు గ్రామానికి చెందిన గుండుబోయిన హరికృష్ణ (30) కొండూరుసత్రం వద్ద ఉన్న అట్టల ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. ఫ్యాక్టరీ నుంచి స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరాడు. ఈ క్రమంలో చైన్నె నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కారు కొండూరుసత్రం సమీపంలో వేగంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్సై శివరాకేష్‌ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

81 బస్సులపై కేసుల నమోదు1
1/3

81 బస్సులపై కేసుల నమోదు

81 బస్సులపై కేసుల నమోదు2
2/3

81 బస్సులపై కేసుల నమోదు

81 బస్సులపై కేసుల నమోదు3
3/3

81 బస్సులపై కేసుల నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement