దాడి కేసులో నిందితుల అరెస్ట్
కోట: కోట సామాజిక ఆరోగ్య కేంద్రం సిబ్బందిపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. గూడూరు రూరల్ సీఐ కిశోర్‌బాబు విచారణ జరిపి ఏడుగురిపై కేసు నమోదు చేశారు. వారిలో ఐదుగురిని సోమవారం అరెస్ట్ చేశారు. అందరిపై రౌడీషీట్ ఓపెన్ చేయడంతోపాటు పోలీస్‌స్టేషన్ నుంచి కోట బస్టాండ్ వరకు నడిపించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ 17వ తేదీ రాత్రి సీహెచ్‌సీలో చికిత్స చేస్తున్న డాక్టర్‌ను దూషించి విధులకు ఆటంకం కలిగించడంతోపాటు సెక్యూరిటీ గార్డు రాకే ష్, మస్తాన్‌లపై దాడికి పాల్పడినట్లు తెలిపారు. ఈ ఘటనలో సూర్యతేజ, అరుణ్ కుమార్, కాంబ్లి, భూపతి, దొరబాబు, నరేంద్ర, కల్యాణ్ నిందితులన్నారు. అరుణ్ కుమార్, భూపతిపై గతంలోనే రౌడీషీట్ ఉందన్నారు. భూపతి, నరేంద్ర మినహా మిగిలిన ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై పవన్ కుమార్ పాల్గొన్నారు.


