ఎనీటైమ్ తాగుతూ తూగుతూ
● మామూళ్ల మత్తులో ఎకై ్సజ్
మద్యం వ్యాపారులు నిబంధనలకు నీళ్లొదిలి అవకాశం ఉన్నంత మేరకు విక్రయాలు సాగిస్తూ జేబులు నింపుకుంటుండగా, నిబంధనలు పక్కాగా అమలు చేయాల్సిన ఎక్సైజ్‌శాఖ మామూళ్ల మత్తులో జోగుతోందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. జిల్లాలో 200 మద్యం దుకాణాలు, 36కుపైగా బార్ అండ్ రెస్టారెంట్లున్నాయి. మద్యం అమ్మకాలు పెంచుకుని జేబులు నింపుకునేందుకు కొందరు వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. సమయపాలనకు నీళ్లొదిలారు. మద్యం దుకాణాలు ప్రతిరోజు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు, బార్ అండ్ రెస్టారెంట్లు ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల వరకు నిర్వహించాలి. అయితే అనేక దుకాణాలు, బార్లలో నైట్‌సేల్స్‌తో పాటుగా తెల్లవారుజాము నుంచే విక్రయాలు సాగుతున్నాయి. నిత్యం మద్యం అందుబాటులో ఉండటంతో నేరాలు పెరుగుతూ శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది.
– నెల్లూరు(క్రైమ్)
ఎనీటైమ్ తాగుతూ తూగుతూ
ఎనీటైమ్ తాగుతూ తూగుతూ


