జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో ఈ నెల 12 నుంచి 15 వరకు నిర్వహించనున్న ఆట్యాపాట్యా నేషనల్స్ జూనియర్స్ చాంపియన్‌షిప్‌కు నెల్లూరులోని ఎమ్మెస్సెమ్ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయుడు మురళీకృష్ణ తెలిపారు. పాఠశాలలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో రిషిత, వైష్ణవిని అభినందించిన అనంతరం ఆయన మాట్లాడారు. పిడుగురాళ్లలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా బాలికల జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకాన్ని సాధించారని వివరించారు. పీడీ అజయ్‌కుమార్, పీఈటీ రేష్మా తదితరులను అభినందించారు.


