మా మొర ఆలకించండయ్యా..
● అర్జీదారులతో కలెక్టరేట్ కిటకిట
● వినతులు స్వీకరించిన కలెక్టర్
నెల్లూరు(అర్బన్): ‘అయ్యా ఎన్నిసార్లు తిరిగినా మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీఓ, ఇతర అధికారులు సమస్యలను పరిష్కరించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కలెక్టరేట్‌కు వచ్చాం. మీరైనా మా మొర ఆలకించండయ్యా’ అంటూ పలువురు అర్జీదారులు వేడుకున్నారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రెడ్డి, డీపీఓ వసుమతి, సర్వేశాఖ ఏడీ రఘురామరాజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
మా స్థలాన్ని పోలీస్ కుటుంబం
కబ్జా చేసింది
కావలి పట్టణం ట్రంక్ రోడ్డును ఆనుకుని మాకు ఆస్తి ఉంది. మా స్థలానికి, రోడ్డుకు మధ్యలో ఉండే కొంత శివాయి స్థలం ఎప్పట్నుంచో మా స్వాధీనంలో ఉంది. అయితే టు టౌన్ కానిస్టేబుల్ రాజేంద్ర తల్లిదండ్రులు అక్కడ చికెన్ షాపు పెట్టారు. అందువల్ల తమ స్థలానికి దారి, ఇతర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆర్థిక ఇబ్బందులతో పట్టా స్థలాన్ని అమ్ముకుందామని నిర్ణయించుకున్నాం. అయితే అడ్డంగా ఉన్న చికెన్ షాపు వల్ల కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దానిని తీసేయాలని కోరాం. అందుకు విరుద్ధంగా ఇంకా విస్తరించి పెద్ద షాపు పెట్టారు. అడిగితే దౌర్జన్యం చేసి బెదిరిస్తున్నారు. కావలి పోలీసులకు, ఆర్‌అండ్‌బీ అధికారులకు ఫిర్యాదు చేశాం. న్యాయం జరగలేదు. చికెన్ షాపు తొలగించి ఆదుకోవాలి.
– శోభనాల సాయిసుస్మిత,
కుటుంబ సభ్యురాలు, కావలి
మా మొర ఆలకించండయ్యా..
మా మొర ఆలకించండయ్యా..


