వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
దగదర్తి: పీహెచ్‌సీలకు వచ్చే రోగులకు వైద్యసేవలను అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ సుజాత పేర్కొన్నారు. దగదర్తి పీహెచ్‌సీని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె.. రోగులకు అందుతున్న వైద్యసేవలపై సమీక్షించారు. ఓపీ సేవలపై వైద్యాధికారులను ఆరాతీశారు. ల్యాబ్‌ను సందర్శించి వైద్య పరీక్షలు ఎలా జరుగుతున్నాయో టెక్నీషియన్లను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వైద్యులు అఖిల, అలేఖ్య, సీహెచ్‌ఓ కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అభ్యసన మెరుగులో
పాల్ ల్యాబ్‌ల పాత్ర కీలకం
నెల్లూరు (టౌన్): తరగతి గదిలో అభ్యసన మెరుగునకు పర్సనాల్టీ అడాప్ట్ లెర్నింగ్ ( పా ల్) ల్యాబ్‌లు ఎంతో ఉపయోగపడతాయని సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు. పాల్ ల్యాబ్‌లపై దర్గామిట్టలోని జెడ్పీ హైస్కూల్లో శిక్షణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు గణితం, తెలుగు, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో బోధనకు సంబంధించిన పూర్తి సమాచారం నిక్షిప్తమైన 330 ట్యాబ్‌లను ఆయా పాఠశాలల హెడ్‌మాస్టర్లకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో తొలి విడతలో 33 పాల్ ల్యాబ్‌లొచ్చాయని, నూతనంగా పీఎంశ్రీ పాఠశాలలకు మరో 11 మంజూరయ్యాయని వివరించారు. డిప్యూటీ డీఈఓ నాయక్, పాల్ డీఎన్‌ఓ సుధీర్‌బాబు, ఎంఈఓ మురళీధర్, ఏపీఓ ప్రసాద్, ఏఎస్‌ఓ ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పెన్నాకు నేటి నుంచి
30 వేల క్యూసెక్కులు
సోమశిల: సోమశిల క్రస్ట్ గేట్ల ద్వారా పెన్నాకు 30 వేల క్యూసెక్కులను శుక్రవారం నుంచి విడుదల చేయనున్నామని జలాశయాధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పెన్నా పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో ఎగువ ప్రాంతాల నుంచి మూడు లక్షల క్యూసెక్కుల వరదొచ్చే అవకాశాలున్నాయనే అంచనా మేరకు ప్రాజెక్ట్ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
72.73 టీఎంసీల నీరు
సోమశిల జలాశయంలో 72.737 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 9856 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. జలాశయంలో 99.862 మీటర్ల నీటిమట్టం నమోదైంది.
అర్హులకే పక్కాగృహాలు
నెల్లూరు(అర్బన్): ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0 ద్వారా జిల్లాలో జరుగుతున్న ఆవాస్ ప్లస్ సర్వేలో ఇల్లు లేని అర్హత ఉన్న నిరుపేదలకే పక్కా గృహాలను ముందుగా మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీ అరుణ్‌బాబు సూచించారు. జిల్లా పర్యటనకు గురువారం వచ్చిన ఆయన నగరంలోని వెంకటేశ్వరపురంలో నిర్మాణంలో ఉన్న పక్కాగృహాలు, పూర్తయిన వాటిని తనిఖీ చేశారు. అనంతరం హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో డీఈలు, ఏఈలతో సమావేశాన్ని నిర్వహించారు. హౌసింగ్ కార్పొరేషన్ జిల్లా పీడీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు


