సమస్య వినండి.. ధైర్యం చెప్పండి
● ఎస్పీ అజిత
కోవూరు: ‘పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించండి. వారి సమస్యలు వినండి. మేమున్నామని ధైర్యం చెప్పండి’ అని ఎస్పీ అజిత తెలిపారు. ఆమె గురువారం కోవూరు సర్కిల్ ఆఫీస్, పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణ తదితర అంశాల గురించి ఎస్పీ ఆరాతీశారు. ఆమె మాట్లాడుతూ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా పెంచాలన్నారు. వారు ప్రతి ఆదివారం కౌన్సెలింగ్‌కు హాజరయ్యేలా చూడాలన్నారు. ఫిర్యాదుదారులతో ఓపికగా వ్యవహరించాలన్నారు. పోలీస్ వ్యవస్థపై నమ్మకం కలిగేలా పని చేయాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నారుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పి ంచాలన్నారు. హైవేపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ స్టేషన్ మ్యాప్, పరిసరాలను పరిశీలించారు. సిబ్బంది యోగక్షేమాలు తెలుసుకున్నారు. సీఐ సుధాకర్‌రెడ్డితో మాట్లాడి నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల గురించి ఆరాతీశారు.


