లక్ష దీపోత్సవం ప్రారంభం
నెల్లూరు(బృందావనం): కార్తీక మాసం సందర్భంగా వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు వీఆర్సీ మైదానంలో కార్తీకమాస లక్ష దీపోత్సవం గురువారం ప్రారంభమైంది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సమక్షంలో, విశాఖపట్టణం శ్రీసౌభాగ్య భువనేశ్వరి పీఠం అధిపతి రామానందభారతిచే లింగోద్భవం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రామానందభారతిచే తొలుత పండరీనాథ స్వామి ఆలయాన్ని ప్రారంభించి అనంతరం నాగేశ్వర జ్యోతిర్లింగానికి అభిషే కం చేశారు. చాగంటి ఉపన్యసిస్తూ సనాతన ధర్మానికి ప్రాణం అగ్ని ఆరాధనని చెప్పారు. అగ్ని ఆరాధనే కార్తీక దీపారాధనకు మూలమన్నారు. దీపం పరబ్రహ్మ స్వరూపంగా పేర్కొన్నారు. కార్తీకదీప విశిష్టతను వివరించారు.
లక్ష దీపోత్సవం ప్రారంభం
లక్ష దీపోత్సవం ప్రారంభం


