ఇరుక్కుపోయిన లారీ
నెల్లూరు(క్రైమ్): ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల వద్ద లారీ ఇరుక్కుపోవడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. వివరాలు.. బుజబజనెల్లూరు హైవేపై నూతనంగా ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నారు. మంగళవారం వర్షాల కారణంగా అక్కడంతా బురదమయంగా మారింది. గూడూరు వైపు నుంచి కావలి వైపు వెళ్తున్న పదహారు టైర్ల లారీ అందులో ఇరుక్కుపోయింది. దీంతో వాహనాలు వెళ్లే దారిలేక ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న సౌత్ ట్రాఫిక్ ఆర్‌ఎస్‌ఐ చంద్రమౌళి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జేసీబీ, పొక్లెయిన్ సాయంతో లారీని పక్కకు తొలగించారు. అనంతరం ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.


