నాటికి.. నేటికీ ఎంతో వ్యత్యాసం
2019 నుంచి 2024 వరకు సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగించిన సమయంలో వర్షాలు, వరదలు తరచూ వచ్చేవి. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు నెలకోసారి విపత్తులు రావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడేది. అయితే అప్పట్లో పరిపాలనను ఆయన వికేంద్రీకరణ చేశారు. సచివాలయ, వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఎలాంటి సాయాన్నైనా గంటల వ్యవధిలో వలంటీర్లతో ఇళ్ల వద్దకే అందేలా చేశారు. అప్పట్లో వరదలొచ్చిన సమయంలో వలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల ద్వారా నిరంతర పర్యవేక్షణ జరిపి నిమిషాల్లో పునరావాస కేంద్రాలకు చేర్చేవారు. అక్కడ ఎవరికీ ఏ లోటూ రాకుండా అన్ని ఏర్పాట్లూ చేసేవారు.
ప్రజాసంక్షేమమే పరమావధిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పక్కాగా ఏర్పాట్లు
సచివాలయ సిబ్బంది,
వలంటీర్లతో సమన్వయం
చేసుకుంటూ చర్యలు
బాధితులకు రూ.రెండు వేల చొప్పున సాయం, నిత్యావసర వస్తువుల కిట్ల అందజేత
నాడు


