తుఫాన్‌ నష్ట నివేదిక | - | Sakshi
Sakshi News home page

తుఫాన్‌ నష్ట నివేదిక

Oct 30 2025 7:49 AM | Updated on Oct 30 2025 7:49 AM

తుఫాన

తుఫాన్‌ నష్ట నివేదిక

ప్రకృతి విపత్తుల గాయాలు..

ప్రభుత్వ నిర్దయ పేదలకు శాపంగా మారాయి.

చంద్రబాబు పాలనలో హడావుడి, డప్పు తప్ప.. నిరాశ్రయులను ఆదుకునే మనసు శూన్యమనే చెప్పాలి. మోంథా తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంపు ప్రాంతాల బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడం మొదలుకొని వసతులు కల్పించడం, సాయం అందించడం వరకు సర్కారు చిన్న చూపు చూసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంగళవారం ఒక్క రోజు పునరావాసం కల్పించినా.. కనీసం వారికి సకాలంలో భోజనాలు, చిన్నారులకు పాలను అందించడంలో నిర్లక్ష్యం కనిపించింది. వర్ష తీవ్రత తగ్గిపోవడంతో తిరిగెళ్తున్న బాధితులకు రూ.వెయ్యి సాయం అందిస్తామని చెప్పడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలోనూ ఇలాంటి విపత్తులు ఏటా తలెత్తాయి. ఆ సమయంలో పునరావాస కేంద్రాల్లో సకల సౌకర్యాలను కల్పించడంతో పాటు తిరిగెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరికీ రూ.రెండు వేల చొప్పున సాయమందించారు. ఇదంతా అప్పట్లో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల వ్యవస్థతో అధికారులు సమన్వయంతో పనిచేయడంతోనే సాధ్యమైందని గుర్తు తెచ్చుకుంటున్నారు.

సాక్షిప్రతినిధి, నెల్లూరు: మోంథా తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాల్లోకి పెద్ద ఎత్తున వరదనీరు చేరింది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు దాదాపు నాలుగు వేల మందిని 77 పునరావాస కేంద్రాలకు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆధ్వర్యంలో అధికారులు తరలించారు. అధికారులు కష్టపడినా, ప్రజలను ఆదుకోవడంలో సీఎం చంద్రబాబుకు మనసు రాలేదు. కేవలం సమీక్షలతో సరిపెట్టారు. ప్రజలకు సాయం చేసేందుకు సరిపడా నగదును ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో పలుచోట్ల బాధితుల ఆకలిని అధికారులు, కొంత మంది ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష పార్టీల నేతలు తీర్చారు. పునరావాస కేంద్రాల్లో పసిబిడ్డలకు పాలు, దుప్పట్లను అందించడంలోనూ విఫలమయ్యారు.

బాబు జమానాలో రూ.వెయ్యేనంట

జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో బాధితులను యుద్ధప్రాతిపదికన ఆదుకున్నారు. శిబిరాల్లో తలదాచుకునేందుకు వచ్చిన వారిలో ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి రూ.రెండు వేల చొప్పున సాయాన్ని అందజేశారు. దీంతో పాటు ఒక్కో కుటుంబానికి బియ్యం బస్తా, బంగాళదుంపలు, ఉల్లిగడ్డలు, నూనె, పంచదార, పప్పులతో కూడిన కిట్‌ను అందించి సంతోషంగా ఇంటి వద్దకు పంపారు. అయితే చంద్రబాబు పాలనలో బాధితులను ఆదుకునే విషయంలో మానవత్వం కరువైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పునరావాస శిబిరాల్లో తలదాచుకున్న వారికి రూ.వెయ్యిని ఇస్తామని ప్రకటించారు. ఒక కుటుంబంలో ముగ్గురికి మించి ఉంటే గరిష్టంగా రూ.మూడు వేలనే అందిస్తామని చెప్పారు. బియ్యం, నూనె, పప్పు, పంచదార ఇస్తామని చెప్పినా, ఇంకా ఆచరణకు నోచుకోలేదు. వలంటీర్లు లేకపోవడం, సచివాలయ ఉద్యోగులే భారం మోయాల్సి రావడంతో బాధితులు ఒట్టి చేతులతో ఊసురుమంటూ ఇళ్లకెళ్లారు. నాటి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని, నేటి చంద్రబాబు ప్రభుత్వాన్ని బేరీజు వేసుకుంటున్నారు.

బాధితుల జాబితాపై బోగస్‌ లెక్కలు

జిల్లా వ్యాప్తంగా 77 పునరావాస కేంద్రాల్లో 3,977 మంది తలదాచుకున్నారని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. అయితే బుధవారం ఉదయానికి 7200 మందికిపైగా ఉన్నట్లు కలెక్టరేట్‌కు జాబితాలొచ్చాయి. తెల్లారే సరికి రెట్టింపెలా అయ్యారని కలెక్టరేట్‌ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పునరావాస బాధితుల లెక్కలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొంత మంది అధికార పార్టీ నేతలు పునరావాస శిబిరాల్లో లేని వారి పేర్లను సైతం నమోదు చేయించారనే ప్రచారం జరుగుతోంది. అక్కడి అధికారులపై ఒత్తిడి తెచ్చి బోగస్‌ పేర్లిచ్చి లెక్కలు పెంచి పరిహారాన్ని కాజేసేందుకు యత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు చిత్తశుద్ధిగా వ్యవహరించి అసలైన బాధితులకు మాత్రమే పరిహారం అందజేసి ప్రజాధనాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

బాబు జమానాలో..

ఒక్కరికి రూ.1,000.. కుటుంబానికి

గరిష్టంగా రూ.3,000 + నిత్యావసర సరుకులు

మోంథా తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు

లోతట్టు ప్రాంతాలు జలమయం

77 పునరావాస కేంద్రాలకు

3977 మందికిపైగా తరలింపు

చాలా చోట్ల భోజనం, పాలు, దుప్పట్లు అందించడంలో విఫలం

కొన్ని చోట్ల ఆకలి కష్టాలను తీర్చిన పర్యవేక్షణాధికారులు, నేతలు

బాధితులకు రూ.వెయ్యి చొప్పున ఇస్తామని హామీ

వానలు తగ్గాక ఒట్టి చేతులతో

బాధితుల తిరుగుముఖం

నారా వారి పాలనలో

డప్పు తప్ప.. సాయం శూన్యం

తుఫాన్‌ నష్ట నివేదిక1
1/5

తుఫాన్‌ నష్ట నివేదిక

తుఫాన్‌ నష్ట నివేదిక2
2/5

తుఫాన్‌ నష్ట నివేదిక

తుఫాన్‌ నష్ట నివేదిక3
3/5

తుఫాన్‌ నష్ట నివేదిక

తుఫాన్‌ నష్ట నివేదిక4
4/5

తుఫాన్‌ నష్ట నివేదిక

తుఫాన్‌ నష్ట నివేదిక5
5/5

తుఫాన్‌ నష్ట నివేదిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement