 
															అంచనాలను రూపొందించండి
నెల్లూరు రూరల్: భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రాథమిక అంచనాలను రూపొందించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. తుఫాన్ అనంతర పరిస్థితిపై కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాలకు నానిన పాఠశాలల ప్రహరీ, తదితరాలను పరిశీలించాలని పేర్కొన్నారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కూరగాయల విక్రయాలను మరో రెండు రోజుల పాటు కొనసాగించాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు సూచించారు. డీఆర్వో విజయ్‌కుమార్, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, డీటీసీ చందర్, డీఈఓ బాలాజీరావు, జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, హార్టికల్చర్ అధికారి సుబ్బారెడ్డి, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈలు దేశ్‌నాయక్, గంగాధర్, విజయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
