
ఇష్టారాజ్యంగా..
● పెన్నానదిలో ఇసుక తవ్వకాలు
ఆత్మకూరు రూరల్: మండలంలోని బండారుపల్లి వద్ద పెన్నానదిలో ఆదివారం అక్రమంగా ఇసుక తవ్వకాలు ప్రారంభించారు. మహిమలూరు, దేపూరు గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో నదిలో తాగునీటి బావుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనులు జరిగే ప్రదేశానికి వెళ్లేలా తాత్కాలికంగా రోడ్డు నిర్మాణం చేశారు. అయితే దేపూరుకు చెందిన కొందరు ఈ రోడ్డుపై జేసీబీలను నిలిపి నదిలో అక్రమంగా ఇసుకను ట్రాక్టర్లకు లోడ్ చేస్తున్నారు. ఈ సమాచారం అందడంతో సంబంధిత అధికారులు అడ్డుకున్నారు. అయినా అక్రమార్కులు లెక్క చేయకపోవడంతో పలువురు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆత్మకూరు ఎస్సై జిలానీ వెళ్లడంతో అక్రమార్కులు వెళ్లిపోయారు.