
మాట్లాడుతున్న వంగవీటి నరేంద్ర
టీడీపీ పాలనలో కాపుల హత్యలు పరిపాటిగా మారాయి
సీఎం చంద్రబాబు, లోకేశ్‌లను ఏ2, ఏ3గా చేర్చాలి
వైఎస్సార్‌సీపీ నేతల ధ్వజం
లక్ష్మీనాయుడు కుటుంబానికి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు వేర్వేరుగా పరామర్శ
కందుకూరు/పెదకాకాని/గుంటూరు మెడికల్ : కాపు యువకుడు తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య కేసులో మొదటి ముద్దాయి ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ అవుతారని వైఎస్సార్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలన్న ఏకైక లక్ష్యంతో ఎన్నికలకు ముందు కాపులను టీడీపీకి ఓట్లు వేసేలా ప్రోత్సహించి.. చివరికి టీడీపీ అధికారంలోకి రాగానే అదే కాపులను ఘోరంగా చంపుతుంటే కనీసం ప్రశి్నంచలేని స్థితిలో పవన్‌కళ్యాణ్ ఉండిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కేసులో నిందితులకు కొమ్ముకాస్తూ కేసును నీరుగార్చేలా ఆదేశాలిస్తున్న సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లను ఏ2, ఏ3లుగా చేర్చాలని డిమాండ్ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో ఇటీవల దారుణ హత్యకు గురైన లక్ష్మీనాయుడు కుటుంబాన్ని జక్కంపూడి రాజా, వంగవీటి నరేంద్రలు వేర్వేరుగా పరామర్శించారు. అలాగే, ఇదే ఘటనలో తీవ్రగాయాలపాలైన లక్ష్మీనాయుడు తమ్ముడు పవన్‌నాయుడు, బాబాయి కుమారుడు భార్గవ్‌నాయుడులను గుంటూరు ఉదయ్ ఆస్పత్రిలో జక్కంపూడితో పాటు, అంబటి రాంబాబు పరామర్శించారు.
ఈ సందర్భంగా వారు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచి్చనా కాపులను హత్యచేయడం పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు. వంగవీటి రంగా హత్యతో పాటు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుటుంబంపై ఎలాంటి భాషను ఉపయోగించి ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసన్నారు. తాజాగా ఈ నెల 2న తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య జరిగితే ప్రభుత్వం స్పందించడం లేదని.. పవన్‌కళ్యాణ్‌కు బాధిత కుటుంబాన్ని పరామర్శించే తీరిక కూడా లేదా.. అని ప్రశ్నించారు.
ఏం చేసినా పైనుంచి కాపాడే ఓ అధికార వ్యవస్థ ఉందన్న ధైర్యంతోనే హరిచంద్రప్రసాద్ లాంటి మృగాలు రెచి్చపోతున్నాయన్నారు. హత్యకేసులో ప్రమేయం ఉన్న మిగిలిన నిందితులపై కేసు నమోదు చేయకపోవడం దారుణమని, కూటమి పెద్దల అండదండలతో వారిని తప్పించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. నిందితులకు శిక్ష పడేవరకు బాధితుల తరఫున పోరాడతామని వారు స్పష్టం చేశారు.