
ఆగిన విద్యుత్ సరఫరా.. ఆస్పత్రిలో ఇక్కట్లు
చీకట్లో వార్డు
● పనిచేయని జనరేటర్లు
ఆత్మకూరు: మున్సిపల్ పరిధిలో శనివారం రాత్రి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ సమయంలో జిల్లా ఆస్పత్రిలో చీకట్లు అలుముకున్నాయి. జనరేటర్ కూడా పనిచేయలేదు. దీంతో పలు వార్డుల్లో రోగులు ఇబ్బంది పడ్డారు. సుమారు గంటన్నరపాటు సరఫరా లేదు. నర్సులు సెల్‌ఫోన్ టార్చ్ వెలుగులోనే రోగులకు సైలెన్ పెట్టారు. జనరేటర్ కోసం సెక్యూరిటీ వారిని రోగుల బంధువులు సంప్రదించగా డీజిల్ లేక ఎయిర్ లాగడంతో పనిచేయడం లేదని చెప్పారు. జిల్లా ఆస్పత్రిలో ఇలాంటి దుస్థితి నెలకొనడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆగిన విద్యుత్ సరఫరా.. ఆస్పత్రిలో ఇక్కట్లు