
నేను ఆత్మహత్య చేసుకుంటున్నా
దుత్తలూరు: ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నా’ అంటూ వెలుగు వీఓఏ వాట్సాప్ గ్రూపులో సెల్ఫీ వీడియో పెట్టింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆమెతో మాట్లాడారు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని నందిపాడులో వెలుగు వీఓఏగా రజియా పనిచేస్తోంది. ఆమె ఆదివారం ఆత్మహత్య చేసుకుంటున్నాంటూ వాట్సాప్ గ్రూపుల్లో సెల్ఫీ వీడియో పెట్టింది. సీసీ తనను విధుల నుంచి తప్పించి మరొకరిని పెట్టుకోవాలని చూస్తున్నారని అందులో ఆరోపించింది. కొందరు పొదుపు మహిళలు, మరో వ్యక్తి వేధిస్తున్నారని చెప్పుకొచ్చింది. విషయం తెలుసుకున్న ఎస్సై ఆదిలక్ష్మి సకాలంలో స్పందించి రజియాతో మాట్లాడి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఎస్సై మాట్లాడుతూ వెలుగు అధికారులు వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో విచారించి తగిన చర్యలు తీసుకుని కేసు నమోదు చేస్తామన్నారు.
నేడు కోనలో రథోత్సవం
రాపూరు: దీపావళి వేడుకలకు పెంచలకోన ముస్తాబవుతోంది. సోమవారం మూలమూర్తికి పూజలు నిర్వహిస్తామని ఆలయ అధికారులు ఆదివారం తెలిపారు. పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మిదేవి, చెంచులక్ష్మి ఉత్సవ విగ్రహాలను శ్రీకృష్ణుడు, రుక్మిణీదేవి, సత్యభామగా అలంకరించి రథంపై కొలువుదీర్చి కోన మాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహిస్తారు. నరకాసునివధ తదితర కార్యక్రమాలు జరుగుతాయి.
● వాట్సాప్ గ్రూపులో పెట్టిన వీఓఏ
● వెంటనే స్పందించిన పోలీసులు