
స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్రే లక్ష్యం కావాలి
నెల్లూరు(బారకాసు): స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రే లక్ష్యంగా ముందుకు సాగాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా నగరంలోని బట్వాడిపాళెం నుంచి సారాయంగడి సెంటర్, అక్కడి నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకు సైకిల్ ర్యాలీని శనివారం నిర్వహించారు. దీన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. స్వచ్ఛతలో జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలపాలని కోరారు. నూరు శాతం చెత్త సేకరణ జరగాలని చెప్పారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలను తెలియజేశారు. కమిషనర్ నందన్ తదితరులు పాల్గొన్నారు .
కండలేరులో
60 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో శనివారం నాటికి 60 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి 3,060 క్యూసెక్కుల నీరు చేరుతోందని చెప్పారు. సత్యసాయి గంగకు 1900, పిన్నేరుకు 850, లోలెవల్‌కు 40, హైలెవల్‌కు 200, మొదటి బ్రాంచ్ కాలువలకు ఐదు క్యూసెక్కు లను విడుదల చేస్తున్నామని వివరించారు.

స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్రే లక్ష్యం కావాలి