పత్రికా స్వేచ్ఛపై దాడి | - | Sakshi
Sakshi News home page

పత్రికా స్వేచ్ఛపై దాడి

Oct 18 2025 6:41 AM | Updated on Oct 18 2025 6:41 AM

పత్రికా స్వేచ్ఛపై దాడి

పత్రికా స్వేచ్ఛపై దాడి

నెల్లూరురూరల్‌ : ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధంగా ‘సాక్షి’ జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం, పత్రికా స్వేచ్ఛపై కక్ష పూరిత దాడులు చేయడం దారుణమని, జర్నలిస్టు సంఘాల ఐక్యవేదిక (జేఏసీ) నాయకులు దయాశంకర్‌, ‘సాక్షి’ టీవీ బ్యూరో ఇన్‌చార్జి లోకేశ్‌ అన్నారు. ‘సాక్షి’ పత్రిక ఎడిటర్‌ ధనుంజయరెడ్డి, నెల్లూరు జిల్లా బ్యూరో ఇన్‌చార్జి సీహెచ్‌ మస్తాన్‌రెడ్డి, అర్ధరాత్రి పూట నోటీసులు, కలిరిగి రిపోర్టర్‌ ఇంట్లో సోదాలు చేయడం, వేధించడాన్ని నిరసిస్తూ శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్‌ ఎదుట జర్నలిస్టు సంఘాల నాయకులు, జర్నలిస్టులు నిరసన నినాదాలు చేశారు. కలెక్టర్‌ హిమాన్షు శుక్లాను కలిసి జర్నలిస్టు సంఘాల నాయకులు, జర్నలిస్టులు వినతి పత్రం ఇచ్చారు. కలెక్టర్‌తో నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులకు పార్టీలతో సంబంధం ఉండదన్నారు. ప్రజా సమస్యలపై కథనాలు, వార్తలు మాత్రమే రాస్తారన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే జర్నలిస్టుల విధి అన్నారు. ఈనెల 8న నకిలీ మద్యానికి సంబంధించి స్థానికులు అనుకుంటున్న సమాచారాన్ని వార్త రూపంలో ‘సాక్షి’ ప్రచురించిందన్నారు. ఈ వార్తలో ఏమైనా అభ్యంతరాలున్నాయని భావిస్తే ఖండన పంపొచ్చని లేదా చట్టపరంగా చర్యలు చేపట్టవచ్చన్నారు. అయితే అందుకు విరుద్ధంగా ప్రజా సమస్యలను పరిష్కరించడం చేతకాని ప్రభుత్వం ‘సాక్షి’ పత్రిక బ్యూరో ఇన్‌చారి్‌జ్‌ ఇంటికి అర్ధరాత్రి పూట పోలీసులను పంపి నోటీసులు ఇవ్వడం ఎంత వరకు సమంజనమన్నారు. చుట్టుపక్కల వారిని భయభ్రాంతులకు గురి చేయడం. ఇళ్లలోని మహిళలలను భయపడేలా చేయడం వంటి ఘటనలు చట్టానికి విరుద్ధంగా చేశారన్నారు. ‘సాక్షి’ పత్రిక ఎడిటర్‌ ధనుంజయరెడ్డికి కూడా అర్ధరాత్రి హైదరాబాద్‌లో నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. మాటి మాటికి విచారణ పేరుతో పోలీసుస్టేషన్‌కు పిలిపించడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రజాస్వామ్యానికి నాల్గో స్తంభం జర్నలిజం అనేది మరిచారా అంటూ నిగ్గదీశారు. ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే కాకుండా వార్తలు రాయకుండా అక్రమ కేసులతో జర్నలిస్టులను భయపెట్టే ప్రయత్నం చేయడమేనని ఆరోపించారు. దీనిని తాము ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం తమ చర్యలు మానుకోకుంటే ఐక్య ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ‘సాక్షి’ బ్యూరో మస్తాన్‌రెడ్డి, ‘సాక్షి’ యోగానందరెడ్డి, సాంబశివరావు, ధనలక్ష్మి, హజరత్తయ్య, కృష్ణారెడ్డి, శ్రీధర్‌, రిజ్వాన్‌ తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల విచారణకు ‘సాక్షి’ బ్యూరో హాజరు

సంఘీభావం తెలిపిన జర్నలిస్టులు

నెల్లూరు(క్రైమ్‌): ‘సాక్షి’ పత్రికలో వచ్చిన వార్త కథనాలపై నెల్లూరు రూరల్‌, కలిగిరి పోలీసుస్టేషన్లలో నమోదైన కేసుల్లో ‘సాక్షి’ బ్యూరో ఇన్‌చార్జి సీహెచ్‌ మస్తాన్‌రెడ్డి శుక్రవారం పోలీసు విచారణకు హాజరయ్యారు. అత్యవసర పనుల దృష్ట్యా ఈ నెల 24న విచారణకు హాజరవుతానని ఆయన లిఖిత పూర్వకంగా నెల్లూరు రూరల్‌ ఎస్‌ఐ లక్ష్మణ్‌, కలిగిరి ఎస్‌ఐ ఉమాశంకర్‌లను కోరారు. అందుకు వారు సమ్మతించారు. జర్నలిస్టులు పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్‌ పోలీసుస్టేషన్‌ వద్దకు చేరుకుని మస్తాన్‌రెడ్డికి సంఘీభావం ప్రకటించారు. ‘సాక్షి’ మీడియాపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలనీ, వేధింపులు ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

‘సాక్షి’ జర్నలిస్టులపై

అక్రమ కేసులు దారుణం

వాస్తవాలు రాస్తే వేధిస్తారా?

అర్ధరాత్రి పోలీసుల ద్వారా నోటీసులిచ్చి భయభ్రాంతులకు గురి చేస్తారా?

ప్రజాస్వామ్యానికి నాల్గో స్తంభం జర్నలిజం

కలెక్టర్‌ హిమాన్షు శుక్లాకు జర్నలిస్టుల ఐక్యసంఘాల వేదిక వినతిపత్రం

అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement