
టీచర్లను రిలీవ్ చేయాలి
నెల్లూరు(టౌన్): ఈ ఏడాది జూన్‌లో ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయా లని పలువురు డిమాండ్ చేశారు. నెల్లూరులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద టీచర్లు చేస్తున్న ధర్నాకు మద్దతుగా ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ హజరత్ 48 గంటల ఆమరణ నిరాహార దీక్షను శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో సుమారు 450 మంది ఉపాధ్యాయులు రిలీవర్లు లేని కారణంగా బదిలీ కాలేదన్నారు. ఎంటీఎస్ టీచర్లతో, ఆ తర్వాత డీఎస్సీ నూతన ఉపాధ్యాయులతో రిలీవ్ చేస్తామని చెప్పినా ఇంత వరకు చర్యలు తీసుకోలేదన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు తిరుమలేష్, వెంకటరావు, మాధవి, సుమ, కుసుమ, భార్గవి, వహీదా, సర్వసతి, బ్యూలా పాల్గొన్నారు.