
మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ..
● జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు
● 30 మందిపై కేసుల నమోదు
నెల్లూరు(క్రైమ్): మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎస్పీ అజిత ఆదేశాలతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు లాడ్జీలు, వాహన తనిఖీలు నిర్వహించారు. బహిరంగ మద్యసేవనం చేస్తున్న వారిపై 27 కేసులు నమోదు చేశారు. 2,139 వాహనాలు తనిఖీ చేశారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న 30 మందిపై కేసులు పెట్టారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులపై 258 కేసులు నమోదు చేసి రూ.1,43,810ల అపరాధరుసుము విధించారు. 13 వాహనాలు సీజ్ చేశారు. 63 లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బసచేసిన వారి వివరాలను సేకరించారు. రికార్డులను పరిశీలించారు. లాడ్జీ పరిసరాలు స్పష్టంగా కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. బసచేసే వారి వివరాలను క్రమం తప్పకుండా స్థానిక పోలీసులకు అందజేయాలన్నారు. అనుమానితులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. నేర నియంత్రణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రజలందరూ సహకరించాలని ఈ సందర్భంగా ఎస్పీ కోరారు. ప్రజలు తమ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తిసే డయల్ 112 లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలని కోరారు.

మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ..

మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ..