
పర్యాటక రంగంపై పుస్తకావిష్కరణ
వెంకటాచలం: టూరిజం ఇన్నోవేటివ్ పాత్‌వేస్ టు సస్టైనబుల్ లైవ్లీహుడ్స్ – డైవర్సిఫయింగ్ రూరల్ ఆక్యుపేషన్స్ అనే పుస్తకాన్ని మండలంలోని కాకుటూరు వద్దనున్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో వీసీ అల్లం శ్రీనివాసరావు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో పర్యాటక రంగం చాలా కీలకమైందన్నారు. యువత సృజనాత్మక ఆలోచనలతో ఈ రంగంలోకి రావాలని పిలుపునిచ్చారు. పుస్తక రచయిత డాక్టర్ మైల త్యాగరాజు మాట్లాడుతూ గ్రామీణ సమాజాల్లో ఉపాధి వైవిధ్యానికి పర్యాటకం ఎలా దోహదపడుతుందో ఈ పుస్తకంలో విశ్లేషించామని చెప్పారు. సుస్థిర పర్యాటక పద్ధతులు భారతదేశం వంటి దేశాలకు అత్యంత అవసరమన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి రిజస్ట్రార్ డాక్టర్ కె.సునీత, ప్రిన్సిపల్ సీహెచ్ విజయ, పర్యటక విభాగాధిపతి డాక్టర్ పి.సుజాత తదితరులు పాల్గొన్నారు.
రైతులకు అధిక ఆదాయం
వచ్చేలా చర్యలు
● హార్టికల్చర్ ఏడీ సుబ్బారెడ్డి
నెల్లూరు(పొగతోట): నిమ్మతోటలు సాగు చేస్తున్న రైతులకు అధిక ఆదాయం వచ్చేలా చర్యలు చేపడుతున్నామని హార్టికల్చర్ ఏడీ సుబ్బారెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో నిమ్మ రైతులకు నిర్వహించిన జిల్లా స్థాయి సదస్సులో ఏడీ మాట్లాడారు. రైతులు శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు పాటించాలన్నారు. కేవీకే శాస్త్రవేత్త డి.తిరుపాల్, డాక్టర్ కవిత, ఏడీహెచ్ అనురాధ మాట్లాడారు. పంట కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వివరించారు. సదస్సులో డాక్టర్ కె.వెంకటసతీష్, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
మద్యం బాటిళ్లు
తరలిస్తుండగా..
● గేదెను ఢీకొని బొలెరో ట్రక్కు బోల్తా
కొడవలూరు: మద్యం లోడుతో ఉన్న బొలెరో ట్రక్కు గేదెను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటన జాతీయ రహదారిపై గండవరం ఫ్లై ఓవర్‌పై మంగళవారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్ మండలంలోని మద్యం డిపో నుంచి కావలిలోని మద్యం దుకాణాలకు ట్రక్కు బయలుదేరింది. గండవరం ఫ్లై వర్‌పై గేదె కనిపించక దాన్ని ఢీకొట్టింది. దీంతో వాహనం తిరగబడింది. గేదెకు తీవ్ర గాయాలై నడవలేని స్థితికి చేరుకుంది. ట్రక్కు డ్రైవర్‌కూ గాయాలయ్యాయి. అట్టపెట్టెల్లో ఉన్న కొన్ని మద్యం బాటిళ్లు రోడ్డుపై పడ్డాయి. అందులో కొన్ని పగిలిపోయాయి.
గుర్తుతెలియని వ్యక్తి
ఆత్మహత్య
నెల్లూరు(క్రైమ్): ఆర్థిక సమస్యలో, కుటుంబ కలహాలో, మరే ఇతర కారణాలో తెలియదు గానీ ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నెల్లూరు నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్ – వేదాయపాళెం మధ్యలోని కొండాయపాళెం గేటు సమీపంలో మంగళవారం జరిగింది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. సుమారు 50 సంవత్సరాల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మంగళవారం మెమూ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై హరిచందన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు తెలుపు రంగు షర్ట్, బులుగు రంగు చెక్స్ లుంగీ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పర్యాటక రంగంపై పుస్తకావిష్కరణ

పర్యాటక రంగంపై పుస్తకావిష్కరణ