
నకిలీ మద్యంపై సీబీఐ విచారణ చేపట్టాలి
● వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో
ఎకై ్సజ్ కార్యాలయం ఎదుట నిరసన
ఆత్మకూరు: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు నకిలీ మద్యాన్ని కుటీర పరిశ్రమగా మార్చేసి ఊరూరా బెల్టుషాపుల సరఫరా చేశారని, ఇప్పటికీ జరుగుతుందనే అనుమానాలు ఉన్నాయని సీబీఐతో విచారణ చేపడితే ఎక్కడెక్కడ మూలాలు ఉన్నాయో తెలుస్తాయని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఊరూరా మద్యం దుకాణాలు, వీధికో బెల్టు షాపు చొప్పున ఏర్పాటు చేసి నకిలీ మద్యాన్ని ఏరులై పారిస్తూ ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలను హరిస్తున్న కూటమి ప్రభుత్వ మద్యం విధానాలకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ అధిష్టానం పిలుపు మేరకు, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి సూచనలతో మంగళవారం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులు ఆత్మకూరులోని ఎకై ్సజ్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎకై ్సజ్ సీఐ బి వెంకటరమణమ్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి పాలనలో నకిలీ మద్యం తయారు కుటీర పరిశ్రమగా మారిందని, మద్యపానప్రియుల ఆరోగ్యానికి తూట్లు పొడిచేలా మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మద్యం పాలసీ పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అబ్కారీ శాఖ ద్వారానే కొనసాగించి దఫదఫాలుగా మద్యం షాపులను నియంత్రించేలా చర్యలు తీసుకున్నారన్నారు. అయితే కూటమి పాలన ఏర్పడ్డాక ఏడాదిన్నర కాలంలో పుట్టగొడుగుల్లా మద్యం దుకాణాలు, బెల్టుషాపులు ఏర్పాటయ్యాయని దుయ్యబట్టారు. నకిలీ మద్యం కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి కుటుంబాలకు దిక్కెవరని ప్రశ్నించారు. ప్రస్తుతం బయట పడిన నకిలీ మద్యం కుటీర పరిశ్రమపై ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు సిట్ విచారణకు ఆదేశించామని చెబుతున్నారని, ఈ సిట్ చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటూ ఆరోపించారు. సీబీఐతో విచారణ చేపట్టాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్‌రెడ్డి, బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు బాలిరెడ్డి సుధాకర్‌రెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు, మండలాల కన్వీనర్లు పులగం శంకర్‌రెడ్డి, బిజివేముల పిచ్చిరెడ్డి, చెన్ను వెంకటేశ్వరరెడ్డి, కంటాబత్తిన రఘునాథరెడ్డి, పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి పులిమి రమేష్‌రెడ్డి, కౌన్సిలర్ కొండా స్వరూపరాణి, పార్టీ నాయకులు బట్రెడ్డి జనార్దన్‌రెడ్డి, నోటి వినయ్‌కుమార్‌రెడ్డి, బి.రవికుమార్‌రెడ్డి, ఎ.సుబ్బారెడ్డి, కల్పనారెడ్డి, ఎన్. ప్రసాద్, మీరామొహిద్దీన్, మునీర్, రహీం, జమ్రు, ఎన్.ప్రతాప్, గడ్డం శ్రీనివాసులురెడ్డి, హరిబాబు, బాలచెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.