
దళితులపై పెరుగుతున్న దాడులు
నెల్లూరు రూరల్: రాష్ట్రంలో దళితులపై దాడులు ఎక్కువవుతున్నాయని మాజీ ఎంపీ చింతా మోహన్ ఆరోపించారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. ఇటీవలి కాలంలో సామాజిక న్యాయమంటూ సీఎం చంద్రబాబు తరచూ చెప్తున్నారని, ఇది దళితులను రెండు వర్గాలుగా చీల్చడమానని ప్రశ్నించారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా అతి తక్కువ సేకరించి మిల్లర్లకు ప్రభుత్వం మేలు చేసిందని విమర్శించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నించిన ఘటన ప్రజాస్వామ్యానికే మాయని మచ్చని చెప్పారు.