
చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పాలి
వెంకటాచలం: విద్యాలయాలు చదువుతో పాటు సంస్కారం పెంచే కేంద్రాలుగా పనిచేయాలని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కాంక్షించారు. మాట మంచి కార్యక్రమం ద్వారా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో అక్షర విద్యాలయ విద్యార్థులతో బుధవారం సమావేశమైన ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఉదయాన్నే నిద్ర లేవడం, యోగా, నడక వంటి వ్యాయామాలకు అలవాటు పడాలని సూచించా రు. క్రమశిక్షణతో కూడిన చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఎస్‌ఈఐఎల్ ఎనర్జీకి గోల్డెన్ పీకాక్ అవార్డు
ముత్తుకూరు (పొదలకూ రు) : దేశంలో అతిపెద్ద స్వతంత్ర విద్యుత్ ఉత్పాదకత సంస్థల్లో ఒకటైన ఎస్‌ఈఐఎల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌కు 2025 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమై న గోల్డెన్ పీకాక్ అవార్డు లభించింది. ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విజేతగా నిలిచినట్లు సీఈఓ జనమేజయ మహాపాత్ర వెల్లడించారు. ఈ అవార్డు కార్పొరేట్ సంస్థల అత్యుత్తమ పాత్రను వెల్లడిస్తుందన్నారు. పారదర్శకత, జవాబుదారీతనం, బాధ్యతాయుతమైన వ్యాపార పద్ధతులతోనే అవార్డు లభించిందన్నారు. వాటాదారులతో పాటు దేశ వృద్ధి రేటును సూచిస్తోందని పేర్కొన్నారు. ఈ అవార్డును లండన్‌లో వచ్చే నెల్లో అందజేయనున్నారని వెల్లడించారు.

చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పాలి