
ఘనంగా ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలు
నెల్లూరు(బృందావనం): రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నగరంలో గురువారం గుంటబడి మైదానంలో ఆర్‌ఎస్‌ఎస్ విజయదశమి మహోత్సవం వేడుకగా సాగింది. దీనికి ముఖ్యఅతిథిగా ఆర్యవైశ్య బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొనగళ్ల శోభన్‌బాబు విచ్చేసి మాట్లాడారు. దేశ ఐక్యతలో ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహించిన పాత్ర ఎనలేనిదిగా వివరించారు. ప్రధాన వక్తగా విచ్చేసిన ప్రాంత ప్రచార ప్రముఖ్ బయ్యా వాసు మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నగరంలో ప్రదర్శన చేపట్టడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సంఘ్ చాలక్ బయ్యా రవికుమార్, చిన్నబజార్ ఉపనగర కార్యవాహ్ పనబాక నరేంద్ర, స్వయంసేవకులు, మాతృమూర్తులు పాల్గొన్నారు.