
వివిధ అంశాలపై ఎస్పీ ఆరా
నెల్లూరు(క్రైమ్): ఆయుధాలు.. ముందుగుండు సామగ్రి ఎంత ఉంది.. సీసీ కెమెరాలు ఎన్ని పనిచేస్తున్నాయి.. డయల్ 112కు ఎన్ని ఫోన్‌కాల్స్ వస్తున్నాయి.. ఇలా అనేక అంశాలను ఎస్పీ అజిత వేజెండ్ల ఆరాతీశారు. ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లోని ఆయుధాల గది, ఇంట్రిగేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏఎస్పీ సౌజన్యతో కలిసి గురువారం ఆమె పరిశీలించారు. మందుగుండు సామగ్రి, స్టోర్‌రూమ్‌లో గల అత్యవసర సామగ్రికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకొని వాటిని పరిశీలించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ రూమ్‌లోని వీడియో వాల్, సీసీ కెమెరాల పనితీరు, ఎల్‌హెచ్‌ఎమ్మెస్, డయల్ 112 వ్యవస్థ పనితీరును పరిశీలించారు. డయల్ 112, శక్తియాప్‌నకు కాల్స్ వచ్చిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారమందించాలని కోరారు. పనిచేయని సీసీ కెమెరాలకు వెంటనే బాగుచేయించాలని సూచించారు. బీట్ వ్యవస్థ, హైవే మొబైల్, వీహెచ్‌ఎఫ్ సెట్ మానిటరింగ్‌ను పరిశీలించారు. సీసీ కెమెరాల ద్వారా ఛేదించిన కేసులను తెలుసుకున్నారు. ఏఆర్ డీఎస్పీ చంద్రమోహన్, పీసీఆర్ ఇన్‌స్పెక్టర్ భక్తవత్సలరెడ్డి, ఆర్‌ఐలు రాజారావు, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.